భక్తిప్రపత్తుల నడుమ హరిద్రా ఘటనం | - | Sakshi
Sakshi News home page

భక్తిప్రపత్తుల నడుమ హరిద్రా ఘటనం

Mar 26 2026 7:44 AM | Updated on Mar 26 2026 7:44 AM

ఒంటిమిట్ట: ఒంటిమిట్ట ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం భక్తిప్రపత్తుల నడుమ హరిద్రా ఘటనం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు, సీతారాముల కల్యాణానికి శ్రీకారం చుట్టే తొలి ఆచారంగా జరిపించారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు, మహిళా శ్రీవారి సేవకులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పసుపు కొమ్ములు దంచే పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సిద్ధం చేసిన పసుపును స్వామి వారికి నిర్వహించే స్నపన తిరుమంజనంలో ఉపయోగిస్తారు. అలాగే శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాలు సిద్ధం చేయడానికి కూడా దీనిని విని యోగిస్తారు. ముందుగా పసుపు కొమ్ములు ఇతర పరికరాలను గర్భాలయంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అనంతరం మహాలక్ష్మీ ఆరాధన చేశారు. శ్రీ సూక్తం పఠనానంతరం హరిధ్రా ఘట నం నిర్వహించారు. పసుపు కొమ్ములు దంచి వచ్చి న పసుపు పొడిని స్వామి వారికి సమర్పణ చేసి, తాంబూలం అంజేయడంతో కార్యక్రమం ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ఎ.ప్రశాంతి, ఎలక్ట్రికల్‌ డీఈ సరస్వతి పాల్గొన్నారు.

దంచిన పసుపును ఉత్సవ మూర్తులకు

అభిషేకిస్తున్న ఆర్చకులు

రోళ్లులో పసుపు కొమ్ములను దంచుతున్న డిప్యూటీ ఈవో ప్రశాంతి, చిత్రంలో డీఈ సరస్వతి, పీఆర్‌వో ఎఫ్‌ఏసీ నీలిమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement