జమ్మలమడుగు: జమ్మలమడుగు ఇన్‌చార్జ్ ఆర్డీఓగా శిరీష బాధ్యతలు చేపట్టారు. బుధవారం ఉదయం ఆమె ఆర్డీఓ కార్యాలయంలో అధికారుల సమావేశాన్ని నిర్వహించి అధికారు లతో పరిచయం చేసుకున్నారు. జె.శిరీష కడప అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ సెక్రెటరీగా వ్యవహరిస్తున్నారు.
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న 74వ బీఎన్ ముల్లిక్ మెమోరియల్ ఆల్ ఇండియా పోలీస్ పుట్‌బాల్ ఛాంపియన్ షిప్–2026 పోటీలకు ఏపీ పోలీస్ జట్టుకు జిల్లాకు చెందిన ఏడుగురు పోలీసులు ప్రాతినిధ్యం వహించారు. ఎన్. నాగేంద్ర (డీఏఆర్), కె. బాబు (జీపీఆర్), బి.సిద్దారెడ్డి (డీఏఆర్), ఎస్. ఇమామ్ ఖాసిం ఆర్ ఎస్‌ఐ) తిరుపతి (ఎర్రగుంట్ల), ఎల్. సతీష్‌బాబు (ట్రాఫిక్, కడప), జి. రాజశేఖర్ (డి.ఎ.ఆర్), ఎస్. శివ సుబ్రమణ్యం డి.ఎ.ఆర్) అన్నమయ్య, (కడప) ఉన్నారు.


