ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో ఈ నెల 27న జరిగే ధ్వజారోహణానికి పవిత్ర విష్ణు దర్భతో తయారు చేసిన దర్బ చాప, తాడును టీటీడీ, అటవీశాఖ అధికారులు బుధవారం ఆలయ అధికారులకు సమర్పించారు. ఈ విష్ణు దర్బని అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేకంగా తయారు చేశారు. సుమారు 22 అడుగుల పొడవు, 7.5 అడుగుల వెడల్పు కలిగి, 60 కిలోల బరువు ఉన్న దర్బ చాపతో పాటు 225 మీటర్ల పొడవు గల తాడును ఏటా ధ్వజారోహణానికి వినియోగిస్తారు. ఈ పవిత్ర విష్ణు దర్బను శుద్ధి చేసి, ఎండబెట్టి ధ్వజస్తంభానికి చుడతారు. ఈ తాడుతో గరుడ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభాన్ని సూచిస్తా రు. టీటీడీ ఇంచార్జ్ డీఎఫ్‌వో డాక్టర్ ఏ.వి.ఎన్ శివకుమార్, డీఎఫ్‌వో విజయకుమార్, డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


