కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : అనంతపురం జట్టు అదరగొట్టింది. ఏసీఏ సౌత్‌జోన్ సీ నియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్ విజేతగా నిలిచింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు–అనంతపురం జట్లు పోటీ పడ్డాయి. నెల్లూరు జట్టు 99 పరుగులకు ఆలౌట్ కాగా అనంతపురం జట్టు కేవలం 8.3 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసి విజయం సాధించింది. అనంతపురం జట్టులోని ప్రదీప్‌రెడ్డి తన బౌలింగ్‌లో సత్తా చాటి 6 వికెట్లు తీసి నెల్లూరు జట్టును తక్కువ స్కోరుకే అలౌట్ చేయడం విశేషం. మరో మ్యాచ్‌లో అలాగే చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కడప–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కడప జట్టు కేవలం 119 పరుగులకు ఆలౌట్ కావడంతో చిత్తూరు జట్టు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసి సునాయసంగా విజయం సాధించింది. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 16 పాయింట్లు సాధించి విజేతగా నిలవగా, నెల్లూరు, కర్నూలు 8 పాయింట్లు, కడప జట్టు 4 పాయింట్లు మాత్రమే సాధించింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో అనంతపురం–నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. అనంతరం బ్యాటింగ్‌ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 18.5 ఓవర్లకు 99 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రేవంత్‌రెడ్డి 45, సయ్యద్ ఫర్హాద్ ఖాద్రీ 22 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రదీప్‌రెడ్డి చక్కటి లైనప్‌తో బౌలింగ్ చేసి 6 వికెట్లు తీసి కర్నూలు బ్యాటర్లను హడలెత్తించాడు. మల్లికార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 8.5 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 105 పరుగులు చేసింది. ఆ జట్టులోని దత్తరెడ్డి 22, అర్జున్‌రెడ్డి 56 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని తోషిత్ యాదవ్ 1 వికెట్ తీశాడు. దీంతో అనంతరం జట్టు 9 వికెట్లు తేడాతో విజయం సాధించింది.
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..
వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కడప–చిత్తూరు జట్లు పోటీ పడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 27.4 ఓవర్లకు 119 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధృవకుమార్‌రెడ్డి 28, పఠాన్ షరీఫ్ 26 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, సయ్యద్ సాజిద్ 2, దీపన్ సాయినాథ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 16.2 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 120 పరుగులు చేసింది. ఆ జట్టులోని దినేష్ వర్మ 57 పరుగులు చేశాడు. దీంతో చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
అంతర్ జిల్లాల
వన్డే క్రికెట్ పోటీల్లో విజయం
శ్రీకాంత్, చిత్తూరు
(5 వికెట్లు)
ప్రదీప్‌రెడ్డి, అనంతపురం (6 వికెట్లు)
అర్జున్‌రెడ్డి, అనంత పురం (56 పరుగులు)


