బార్‌లో అగ్నిప్రమాదం | - | Sakshi
Sakshi News home page

బార్‌లో అగ్నిప్రమాదం

Mar 25 2026 7:15 AM | Updated on Mar 25 2026 7:15 AM

రాజంపేట : రాజంపేట–తిరుపతి బైపాస్‌ రహదారిలోని తిరుమల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం సంభవించింది. బార్‌ ముందు ఉన్న ఫ్లెక్సీలు, రేకులు మంటల్లో దగ్ధమయ్యాయి. విద్యుత్‌షార్ట్‌ సర్య్కూట్‌ వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎలాంటి ప్రాణహాని కలగలేదు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదం వల్ల బార్‌ యాజమాన్యానికి నష్టం వాటిల్లింది.

వ్యక్తి ఆత్మహత్య

బద్వేలు అర్బన్‌ : మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి వెళ్లే దారిలో మంగళవారం ఓ వ్యక్తి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మండల పరిధిలోని గాండ్లతిమ్మాయపల్లె గ్రామానికి చెందిన వేముల సుధాకర్‌(38) ఆటో నడుపుకొంటూ జీవనం సాగించేవాడు. ఈయన భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సుధాకర్‌ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండకుండా మద్యం సేవిస్తుండటంతో భార్య గొడవ పడింది. దీంతో గూడెం గ్రామానికి వెళ్లే దారిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న అర్బన్‌ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

మిద్దైపె నుంచి పడి

బేల్దారి మృతి

బద్వేలు అర్బన్‌ : మున్సిపాలిటీ పరిధిలోని మిద్దెలవారిపాలెంలో ఓ ఇంటి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు మిద్దైపె నుంచి పడి ఓ బేల్దారి మృతి చెందాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. గోపవరం మండలం చిన్నగోపవరం గ్రామానికి చెందిన గుండుబోయిన వెంకటసుబ్బయ్య(50) బేల్దారిగా పని చేస్తూ జీవనం సాగిస్తుండే వాడు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం స్థానిక మిద్దెలవారిపాలెంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి రెండవ అంతస్తుకు పూతలు వేసే నిమిత్తం కర్రల సారవ కట్టుకుని పని చేస్తుండగా కర్ర విరిగి కర్రలకు కట్టిన తాడు ఊడిపోవడంతో పై నుంచి కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా వెంకటసుబ్బయ్య మృతి చెందాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement