దాడి కేసులో 12మందికి జైలు | - | Sakshi
Sakshi News home page

దాడి కేసులో 12మందికి జైలు

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

వేంపల్లె : దాడి కేసులో 12మంది ముద్దాయిలకు ఏడాది సాధారణ జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.2వేల చొప్పున జరిమానా విధిస్తూ పులివెందుల జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ చంద్రశేఖర్‌ రెడ్డి తీర్పునిచ్చారని సీఐ నరసింహులు తెలిపారు. కేసు పూర్వాపరాల్లోకి వెళితే.. వేంపల్లెలోని స్థానిక మసీదు కాంప్లెక్స్‌లో చెన్నుపల్లి ఫక్రుద్దీన్‌ అనే వ్యక్తి షాపు పెట్టుకునేందుకు ఒక రూము బాడుగకు తీసుకున్నాడు. ఆ వ్యక్తి రూముకు అద్దె చెల్లించలేదని అక్రమంగా షాపులోకి ప్రవేశించి కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఈ మేరకు ఫక్రుద్దీన్‌ పోలీ సులకు ఫిర్యాదు చేశాడు. 2018లో జరిగిన ఈ ఘటనలో అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం కోర్పు తీర్పునిచ్చిందని సీఐ తెలిపారు.

బాబోయ్‌.. బ్యాటరీ దొంగలు!

సింహాద్రిపురం : మండల కేంద్రమైన సింహాద్రిపురంలో శనివారం రాత్రి మూడు లారీల బ్యాటరీలను దొంగలు ఎత్తుకెళ్లిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బొంత సుధీర్‌ కుమార్‌ రెడ్డి తన మూడు టిప్పర్‌ లారీలను మండల కేంద్రమైన సింహాద్రిపురంలోని తాడిపత్రి రోడ్డులో ఉన్న హెచ్‌పి గ్యాస్‌ పెట్రోల్‌ ఎదురుగా ఉన్న మైదానంలో పార్కింగ్‌ చేశారు. శనివారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ టిప్పర్ల నుంచి మూడు డబుల్‌ బ్యాటరీలు దొంగతనం చేశారు. వీటి విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని లారీల యజమాని సుధీర్‌ కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బంకులో ఉన్న సీసీ కెమెరాలు ఫుటేజీని పరిశీలించగా.. దొంగలు కారులో వచ్చి దర్జాగా బ్యాటరీలను దోచుకెళ్లారు. ఈ మధ్య కాలంలో లారీల బ్యాటరీలు దొంగతనాలు ఎక్కువయ్యాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికితోడు సింహాదిపురం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ లేక నెల రోజులు కావస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఎస్‌ఐని నియమించాలని స్థానికులు కోరుతున్నారు.

ఆర్థిక అక్షరాస్యతపై

అవగాహన ముఖ్యం

తంబళ్లపల్లె: ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉంటేనే బ్యాంకు లావాదేవీలలో సులభంగా లబ్ధి పొందగలరని ఆర్‌బీఐ కౌన్సెలర్లు శోభన్‌,శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అనంతపురం జిల్లా వలంటీరీ ఇంట్రిగేడ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ(విడ్స్‌) ఆద్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్‌, పెన్షన్‌ ప్లానింగ్‌, పొదుపులు, సీనియర్‌ సిటిజెన్స్‌ బ్యాంకు సేవలను వివరించారు. ఎంపీడీఓ బాపూజీ పట్నాయక్‌, డిప్యూటీ ఎంపిడిఓ ప్రసాద్‌ కార్యాలయ , ఏఓ థామస్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జనగణన

– డీఆర్వో విశ్వేశ్వర నాయుడు

కడప సెవెన్‌రోడ్స్‌ : ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2027 జనాభా గణనను డిజిటల్‌ విధానంలో సమగ్రంగా నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా గణన అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. సోమ వారం కలెక్టరేట్‌ లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో భారత సెన్సస్‌–2027 జనగణన కార్యక్రమం నిర్వహణకు సంబంధించి.. మూడవ స్థాయి శిక్షణలో భాగంగా ఫీల్డ్‌ ట్రైనర్లకు శిక్షణ ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమానికి డీఆర్‌ఓ విశ్వేశ్వర నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ మే 1 నుంచి 30 వరకు జిల్లాలో జరగనున్న సర్వేకి సంబంధించి ఫీల్డ్‌ ట్రైనర్స్‌ కు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 2027 జనాభా గణన రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు. మొదటి దశలో ఇళ్ల గణన , రెండవ దశలో జనాభా గణన నిర్వహించబడుతుందన్నారు. రెండవ దశలో కుల గణన కూడా చేపట్టనున్నట్లు తెలిపారు ఈ శిక్షణలో జనాభా గణన జిల్లా ఇంచార్జి, మాస్టర్‌ ట్రైనర్‌ మోహన్‌ రమణ ఫీల్డ్‌ ట్రైనర్స్‌ విధివిధానాలు, బాధ్యతల గురించి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించనున్నట్లు తెలిపారు. జిల్లా జనగణన ఇన్‌చార్జ్‌ మోహన్‌ రమణ, డిప్యూటీ కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement