బీసీల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

బీసీల సమస్యలు పరిష్కరించాలని ర్యాలీ

Mar 24 2026 7:57 AM | Updated on Mar 24 2026 7:57 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : రాష్ట్రంలో బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ భారత చైతన్య యువజన పార్టీ నాయకులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుబ్బారావు, నిర్మల ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీ రక్షణ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో బీసీల సంక్షేమం కోసం వెయ్యి ఎకరాల భూమి కేటాయించాలన్నారు. బీసీ కులాల కార్పొరేషన్లకు నిధులను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. విద్య, ఉద్యో గాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ నాయకులు శ్రీను యాదవ్‌, సురేష్‌, మధు, నాగార్జున, ఓబులేశు, సందీప్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement