వైఎస్‌ జగన్‌ను దెబ్బతీసేందుకే విజయమ్మ లేఖ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను దెబ్బతీసేందుకే విజయమ్మ లేఖ

Mar 22 2026 1:55 AM | Updated on Mar 22 2026 1:55 AM

కడప కార్పొరేషన్‌ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకే వైఎస్‌ విజయమ్మ లేఖ విడుదల చేశారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. శనివారం వైఎస్సార్‌సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తల్లిగా జగన్‌తో మాట్లాడే చనువు, బాధ్యత ఉన్నప్పటికీ మాట్లాడకుండా, కుమార్తె షర్మిలమ్మను రక్షించడంలో భాగంగా రాష్ట్ర ప్రజలను నమ్మించేందుకు విజయమ్మ స్టేట్‌మెంట్‌ను నోటరీ చేయించి విడుదల చేయడం అన్యాయమన్నారు. తల్లిగా మీకు ఇది తగునా... ఇది జగన్‌ను దెబ్బ తీసే కుట్ర కాదా అని ప్రశ్నించారు. కోట్లాది మంది ఆరాధించే అభిమాన నేత వైఎస్‌ జగన్‌ను శత్రువు కంటే మిన్నగా విమర్శించడం దారుణమన్నారు. సరస్వతి పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని షేర్లు అటాచ్‌మెంట్‌లో ఉన్నాయని, కాబట్టి షేర్ల బదలాయింపు జరగదని తెలిసీ షర్మిలమ్మ చట్ట విరుద్ధంగా, మోసపూరితంగా ఆ షేర్లను బదిలీ చేయించుకున్నారన్నారు. అలా చేస్తే వైఎస్‌ జగన్‌ బెయిల్‌ రద్దయి జైలుకు పోవాలనే దుష్ట బుద్ధితో చంద్రబాబుతో కుమ్మకై షర్మిలమ్మ ఇలా ప్రవర్తించారని, ఇలాంటి ఆమె చెల్లెలు పదానికే కళంకమన్నారు. చరిత్రలో షర్మిలమ్మ, సునీతమ్మ లాంటి చెల్లెళ్లు పగవానికి కూడా ఉండకూడదని తెలుగింటి ఆడపడుచులంతా భావిస్తున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఉన్న ఏకై క చెల్లెలు విమలమ్మకు మీరు వాటా పంచి ఇచ్చారా? మీరు ఆడపడుచు విమలమ్మకు వాటా పంచనప్పుడు షర్మిలమ్మకు వాటాను జగన్‌తో ఎలా అడుగుతారని ప్రశ్నించారు. విజయమ్మ దీనిపై రాష్ట్ర ప్రజలకు జవాబు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు.

ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..

కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై పులివెందుల టీడీపీ ఇన్‌చార్జి బీటెక్‌ రవి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఆయన నిశితంగా విమర్శించారు. సునీతమ్మ, షర్మిలమ్మ, విజయమ్మ అందరూ మూకుమ్మడిగా వారి స్వార్థం కోసం కుట్ర పన్నినా.. ఆ పద్మవ్యూహంలో ఇరుక్కోవడానికి జగన్‌ అభిమన్యుడు కాదని అందరినీ ఎదిరించే సత్తా గల అర్జునుడని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరకు నిజం నిలకడ మీద తెలుస్తుందని, తద్వారా జగన్‌ను విజయం వరించి తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ కమలాపురం, చెన్నూరు మండలాల అధ్యక్షులు ఎస్‌.ఉత్తమారెడ్డి, జీఎన్‌ భాస్కర్‌రెడ్డి, చెన్నూరు మండల పరిషత్‌ అధ్యక్షుడు వైఎస్‌ఆర్‌సీపీ మండల నేత చీర్ల సురేష్‌ యాదవ్‌, వైఎస్‌ఆర్‌సీపీ నేత ఎం.వెంకట సుబ్బయ్య పాల్గొన్నారు.

చెల్లెళ్లు అనే పదానికే షర్మిలమ్మ,

సునీతమ్మ కళంకం

వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై బీటెక్‌ రవి వ్యాఖ్యలు సిగ్గుచేటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి

ఆర్‌.వెంకట సుబ్బారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement