ఆలయంలో అమ్మవారి తాళిబొట్టు అపహరణ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో అమ్మవారి తాళిబొట్టు అపహరణ

Mar 22 2026 1:55 AM | Updated on Mar 22 2026 1:55 AM

వేంపల్లె : వేంపల్లెలోని పాపాఘ్ని నది సమీపంలో ఉన్న శ్రీదుర్గా గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు గవిమల్లేశ్వర స్వామి ఆలయానికి ఉన్న తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి తాళిబొట్టుతోపాటు బీరువాలో ఉన్న మరికొన్ని వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. రూ.3 వేల చిల్లర నాణేలు అపహరించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. వారు ఆలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి..

సుండుపల్లె : మండల పరిధిలోని రాయవరంలో శనివారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలలోకి వెళితే.. స్వర్ణలత అనే మహిళ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి గుర్తు తెలియని దుండగులు బీరువాలోని 6.6 తులాల బంగారు నగలు రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఆమె ఇంటి వచ్చిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించింది. వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

మహిళపై భర్త ఎదుటే అసభ్య ప్రవర్తన

మదనపల్లె టౌన్‌ : స్థానిక చౌడేశ్వరి అమ్మవారి జాతరలో మహిళపై భర్త ఎదుటే ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. స్థానికంగా ఉండే మమత ఆమె భర్త సురేష్‌తో కలసి జాతరకు వెళ్లారు. ఈ సందర్భంగా కొంత మంది ఆకతాయి యువకులు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బంగారు నగలు చోరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement