వన్డే మ్యాచ్‌లో అనంతపురం, నెల్లూరు జట్ల విజయం | - | Sakshi
Sakshi News home page

వన్డే మ్యాచ్‌లో అనంతపురం, నెల్లూరు జట్ల విజయం

Mar 22 2026 1:55 AM | Updated on Mar 22 2026 1:55 AM

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ సౌత్‌జోన్‌ సీనియర్స్‌ మెన్‌ అంతర్‌ జిల్లాల క్రికెట్‌ వన్డే మ్యాచ్‌లు రెండవ విడత ప్రారంభం అయ్యాయి. ఈ వన్డే మ్యాచ్‌లో అనంతపురం 260 పరుగుల భారీ స్కోరుతో, నెల్లూరు జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించాయి. వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో అనంతపురం– కర్నూలు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన కర్నూలు జట్టు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 43.5 ఓవర్లకు 339 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని గిరినాథ్‌రెడ్డి 100 బంతుల్లో 10 ఫోర్లు, 14 సిక్సర్లతో చెలరేగి 156 పరుగులు చేశాడు. ఎంకే దత్తరెడ్డి 86 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని ఆంజనేయులు అద్భుతంగా బౌలింగ్‌ చేసి 4 వికెట్లు, షేక్‌ ఇస్మాయిల్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 22.1 ఓవర్లకు 79 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని షేక్‌ ఇస్మాయిల్‌ 23, న్యాయిముల్లా 10 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని సంతోష్‌కుమార్‌ 3, మల్లికార్జున 3 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 260 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో నెల్లూరు–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్‌ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 48.1 ఓవర్లలో 228 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని కేఎన్‌ పృధ్వీరాజ్‌ 68, శశాంక్‌ శ్రీవత్స్‌ 46 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సాకేత్‌ రామ్‌ 4 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన నెల్లూరు జట్టు 34 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ఆ జట్టులోని రేవంత్‌రెడ్డి 93, రోషన్‌ పవన్‌కుమార్‌ 62 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని దీపన్‌ సాయినాథ్‌ 2 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement