సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని పలు గ్రామాల్లో పులివెందుల రూరల్ సీఐ సీతారామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన చిన్న ఓబుళరెడ్డి ఇంట్లో ఉన్న 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
దుకాణంలోకి
దూసుకొచ్చిన ట్రాక్టర్
రాజంపేట : పట్టణ పరిధి రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ స్టీల్, సిమెంట్ దుకాణంలోకి శనివారం ఇసుక ట్రాక్టర్ దూసుకొచ్చింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు.


