ఆలయఘటనపై దేవదాయ శాఖ అధికారుల విచారణ | - | Sakshi
Sakshi News home page

ఆలయఘటనపై దేవదాయ శాఖ అధికారుల విచారణ

Mar 21 2026 5:11 AM | Updated on Mar 21 2026 5:11 AM

ఆలయఘటనపై దేవదాయ శాఖ అధికారుల విచారణ స్పెషల్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌

బద్వేలు అర్బన్‌: మండల పరిధిలోని అనంతరాజుపురం పంచాయతీ లక్ష్మీపాలెం గ్రామంలో ఉగాది సందర్భంగా గురువారం భక్తులకు, పూజారులకు జరిగిన వాగ్వాద ఘటనపై శుక్రవారం దేవదాయశాఖ డివిజనల్‌ టెంపుల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్ధన్‌, ఈవో రామలింగారెడ్డి విచారణ చేపట్టారు. భక్తులను, గ్రామస్తులను, పూజారులను వేర్వేరుగా విచారించారు. అనంతరం వాగ్వాదం జరిగిన భక్తులు, పూజారులను పిలిపించి ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని తెలిపారు. అనంతరం భక్తులకు స్వామివారి సన్నిధిలో పూజలు చేయించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు కృషి చేసిన గ్రామస్తులను దేవదాయశాఖ అధికారులు అభినందించారు.

కడప కార్పొరేషన్‌: కడప నగరపాలక సంస్థ (మున్సిపల్‌ కార్పొరేషన్‌) ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి శుక్రవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ఈ నెల 17వ తేదీతో ముగియడంతో, ప్రభుత్వం కలెక్టర్‌ను ప్రత్యేక అధికారిగా నియమించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆయన కార్పొరేషన్‌ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టి, నగర పాలనపై దృష్టి సారించారు.

సమసిన వివాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement