రాజంపేట: నందలూరు మండలంలోని చెయ్యేటీ పరీవాహక గ్రామమైన టంగుటూరు గ్రామంలో కంఽభాలకుంట సుబ్బరాయుడు, కంభాలకుంట సరస్వతి దంపతులకు పుట్టిన ముగ్గురు కుమార్తెలు చదువుల చెల్లెళ్లుగా రాణించారు. తండ్రి సుబ్బరాయుడు ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి సరస్వతి ఏడవ తరగతి వరకు చదువుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురు కుమార్తెలను విద్యతో ఉన్నతంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఆ దిశగా ప్రోత్సహించారు. తల్లి ప్రోత్సాహంతోనే ముగ్గురు కూడా సరస్వతులుగా మారారు. వీరిలో వరుసగా లావణ్యలక్ష్మీ, మాధవి, ప్రసన్నకుమారిలు ఉన్నారు. లావణ్యలక్ష్మీ 2009లో గ్రూప్–1 విజేతగా నిలిచి మచిలీపట్నంలో డీఎస్పీగా తొలిపోస్టింగ్ చేపట్టారు.. ప్రస్తుతం ఐపీఎస్ హోదాతో ఇంటిలిజెన్స్ రాష్ట్ర కార్యాలయంలో ఎస్పీగా పనిచేస్తున్నారు.
● ఇక మరో చెల్లి మాధవి టిడ్కో డిపార్టుమెంట్‌లో సిస్టమ్ సూపర్‌వైజరుగా పనిచేస్తుండగా.. ప్రసన్నకుమారి గ్రూప్–1లో టాప్–3లో నిలిచి ఆర్డీవోగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఒంగోలు ఆర్డీవోగా పనిచేస్తున్నారు.


