అన్నింటా మహిళలు రాణింపు | - | Sakshi
Sakshi News home page

అన్నింటా మహిళలు రాణింపు

Mar 8 2026 7:45 AM | Updated on Mar 8 2026 7:45 AM

సమాజంలో మహిళా సాధికారత సాధించడానికి విద్య, ఉపాధి, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ అధికారం ఉండాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు ఇంటిని చక్కదిద్దడానికే పరిమితమైన మహిళలు నేడు అనూహ్యంగా వివిధ రంగాల్లో మగవారికే సవాల్‌గా మారుతున్నారు. మునుపటి కన్నా నేడు మహిళలు వివిధ రంగాల్లో దూసుకుపోతున్నారు. అయినా ఆధునిక జీవిత పరుగులో మరింతగా పురోగతి చెందాల్సిన ఆవశ్యకత ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలకు అందజేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి.

– శ్యామల ఎస్‌.సుందర్‌, జాతీయ మహిళా కమిషన్‌ మాజీ సభ్యురాలు

ఆత్మస్థైర్యంతో విజయం సాధ్యం

మహిళలు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలి. లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి, లక్ష్యసాధనపై దృష్టి పెట్టాలి, కష్టపడాలి, సాధించాలి. కెరియర్‌, ప్రవర్తన, వ్యక్తిత్వాన్ని అతివలే నిర్మించుకోవాలి. ఆర్థికంగా, సామాజికంగా మహిళలు రాణించాలంటే ఉన్నత విద్యాభ్యాసాన్ని తల్లిదండ్రులు అందించాలి. నేను ఈ రోజు ఈ స్థానంలో ఉండడానికి ముఖ్య కారణం నా తల్లిదండ్రులు. అందులో నా తల్లి లక్ష్మీదేవి, తన భర్త, రాజంపేట మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌ ప్రోత్సాహమే కారణం. ఈ ఉన్నత స్థానానికి చేర్చిన తన తల్లికి ధన్యవాదాలు తెలియజేశారు. – కె.ప్రత్యూష కుమారి,

చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, కడప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement