లింగాల : లింగాలలోని నూతన పోలీస్‌స్టేషన్ భవనాన్ని కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం పరిశీలించారు. ఈ భవనాన్ని రాష్ట్ర హోంమంత్రి అనిత ఈ నెల 10న ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై పులివెందుల పోలీస్ అధికారులతో ఎస్పీ చర్చించారు. ఈ భవన నిర్మాణాన్ని రూ.1.75 కోట్లతో పాడా నిధులతో 2022 ప్రారంభించి 2023 నాటికి పూర్తి చేశారు. అప్పటి నుంచి ప్రారంభోత్సవానికి నోచుకోలేదు. ప్రస్తుతం ఈ నెల 10న ప్రారంభించేందుకు పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. కార్యక్రమంలో డీఎస్పీ మురళీనాయక్, రూరల్ సీఐ సీతారామిరెడ్డి, ఆర్కెవ్యాలీ సీఐ శంకర్‌రెడ్డి, స్పెషల్‌బ్రాంచ్ సీఐ సదాశివయ్య, ట్రాఫిక్ సీఐ శాంతిలాల్, లింగాల ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
అత్యాధునిక వసతులతో నిర్మాణం
పులివెందుల రూరల్ : అత్యాధునిక వసతులతో లింగాల నూతన పోలీస్‌స్టేషన్ భవనం నిర్మించినట్లు అడిషనల్ ఎస్పీ ప్రకాష్‌బాబు తెలిపారు. లింగాలలో పోలీస్‌స్టేషన్ భవనం పరిశీలించిన అనంతరం ఆయన పులివెందులలోని అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లతో మాట్లాడారు. ఉన్నాతాధికారులు ఆదేశాల మేరకు ప్రారంభత్సోవానికి సంబంధించిన పనులు క్షేత్ర స్థాయిలో పరిశీలించినట్లు చెప్పారు.


