– ఐదుగురికి గాయాలు
సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ సచివాలయం సమీపంలోని రామాలయం ఆలయం వద్ద బెటాలియన్ స్కూల్ వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో ఐదుగురు విద్యార్థులు స్వల్పంగా, రామాలయం వద్ద కూర్చొని ఉన్న ఇద్దరు స్థానికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్ర మాలేగావ్ నుంచి తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి గోధుమల లోడుతో వెళ్తున్న లారీ రాంగ్ రూట్‌లోకి వెళ్లి మాధవరం–1 నుంచి బెటాలియన్‌కు విద్యార్థులను తీసుకుని వస్తున్న పోలీసు స్కూల్‌వ్యాన్‌ను ఢీకొంది. ముందుగా లారీ రామాలయాన్ని ఢీకొని స్కూల్ వ్యాన్‌ను ఢీకొట్టింది. బెటాలియన్ పోలీసులు లారీని సిద్దవటం పోలీస్‌స్టేషన్‌కు తరలించి ఫిర్యాదు చేశారు. తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.


