అభిమానం ముందు అడ్డురాని వైకల్యం | - | Sakshi
Sakshi News home page

అభిమానం ముందు అడ్డురాని వైకల్యం

Mar 7 2026 8:12 AM | Updated on Mar 7 2026 8:12 AM

వైఎస్‌ జగన్‌ కోసందివ్యాంగుడి పరుగు!

తాడేపల్లికి తీసుకురావాల్సిందిగామాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు ఆదేశం

కడప (సాక్షి ప్రతినిధి): అభిమానం ముందు మండుటెండ, అంగవైకల్యం చిన్నబోయాయి. తన అభిమాన నేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని చూసేందుకు వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఖాదర్‌ బాషా అనే దివ్యాంగుడు చూపిన తెగువ అందరినీ కదిలించింది. గురువారం ఒక కార్యక్రమం నిమిత్తం ప్రొద్దుటూరుకు మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వచ్చారు. ఆయన కారులో రోడ్డు వెంట సాగుతుండగా ఓ యువకుడు తనకుఒక కాలు లేకపోయినా, ఊతకర్రల సాయంతో సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల మేర ఏకధాటిగా జగన్‌ వాహనం వెంట పరుగులు తీశారు.

● ఈ విషయాన్ని గమనించిన వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించారు. ఆ యువకుడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? అనే వివరాలు ఆరా తీయాలని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డిని ఆదేశించారు. జగన్‌ ఆదేశాలతో రంగంలోకి దిగిన రాచమల్లు.. ఆ యువకుడిని ఖాదర్‌ బాషాగా గుర్తించి మాట్లాడారు.

● జగన్‌ పై ఉన్న అభిమానమే తనతో ఈ పరుగు పెట్టించిందని, ఎండ, వైకల్యం సైతం లెక్కచేయలేదని ఖాదర్‌ బాషా వివరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్‌ జగన్‌, అతడిని తాడేపల్లిలోని తన నివాసానికి తీసుకురావాలని రాచమల్లును సూచించారు. త్వరలోనే ఖాదర్‌ బాషా మాజీ సీఎం జగన్‌ను వ్యక్తిగతంగా కలవనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement