పులివెందుల: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయలుచేయడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమైనట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం భాకరాపురంలోని తన స్వగృహృం వద్ద మాట్లాడుతూ ఇచ్చిన హమీలను అమలు చేయాలని అంగన్‌వాడీల న్యాయబద్ధగా అడిగితే మహిళలు అని చూడకుండా వారిని రాత్రికి రాత్రి చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయడం దారుణమన్నారు. పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో తాము చేసిన తప్పు కప్పిపుచ్చుకునేందుకు ఎల్లో మీడియా ద్వారా వైఎస్సార్ కాంగ్రేస్‌పార్టీపై బురదజల్లే ప్రయత్నం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు హయాంలో నాణ్యత లేదని టీటీడీ ల్యాబ్ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లను తిరిగి అనుమతించి ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడినట్లుగా సీబీఐ సిట్ చార్జీషీట్‌లో పేర్కొన్నారన్నారు. వీటన్నిటిపై శాసనమండలిలో వైఎస్సార్ సీపీ సభ్యులు చర్చిస్తే దానిని అడ్డుకునేందుకు అధికారపార్టీ సభ్యులు సభను తప్పుదోవ పట్టించేందుకు సాక్షాత్తు శాసన మండలి చైర్మన్‌ను అవమానకరంగా మాట్లాడారన్నారు. వైఎస్సార్ సీపీ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ సభ్యులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు.ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ పీపీపీ విధానంతో త్వరితగతిన అభివృద్ధి అని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


