కడప కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో జిల్లాకు చెందిన వారిని వివిధ హోదాలలో నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ సీపీ జోన్–5 వలంటీర్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా షేక్ ఇస్మాయిల్ (కమలాపురం), స్టేట్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా ఆర్.అబ్దుల్ సుభాన్ (కడప) నియమితులయ్యారు. తన మీద నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, ఎంపీ అవినాష్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్ రామాంజులరెడ్డిలకు ఇస్మాయిల్ కృతజ్ఞతలు తెలిపారు.
కడప అగ్రికల్చర్: జిల్లా రైతుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతన జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. కడప కలెక్టరేట్‌లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో గురువారం నూతన వ్యవసాయ అధికారిగా(జేడీఏ) ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో అందరి ఏడీఏలు, వ్యవసాయ అధికారుల సమన్వయంతో జిల్లా వ్యవసాయ రంగాన్ని అభివృద్ది పథంలో నడిపించేందుకు కృషి చేస్తానన్నారు.


