చంద్రగిరి: ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన చంద్రగిరి మండలంలోని రామిరెడ్డిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. వైఎస్సార్ కడప జిల్లా బాబా సాహెబ్‌పేట, బాలుపల్లికి చెందిన రామానుజరెడ్డి కుమారుడు బొమ్మేపల్లి హర్షవర్ధన్ రెడ్డి(21) ఏ.రంగంపేట సమీపంలోని ఎంబీయూ యూనివర్సిటీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. గురువారం సాయంత్రం కళాశాల నుంచి వచ్చిన హర్షవర్ధన్‌రెడ్డి, రామిరెడ్డిపల్లిలోని అద్దెకు ఉంటున్న గదికి వెళ్లాడు. తోటి స్నేహితులు తర్వాత వచ్చి తలుపులు కొట్టినా తీయకపోవడంతో ఇంటి యజమాని సుబ్రమణ్యం యాదవ్‌కు సమాచారం అందజేశారు. అనంతరం ఇంట్లోకి వెళ్లి చూడగా హర్షవర్ధన్ రెడ్డి ఉరి వేసుకుని మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ అరుణాచలం ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.


