కారు,బైక్‌ ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు | - | Sakshi
Sakshi News home page

కారు,బైక్‌ ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు

Mar 6 2026 8:26 AM | Updated on Mar 6 2026 8:26 AM

అట్లూరు : మండల పరిధిలోని కడప – బద్వేలు ప్రధాన రహదారిపై అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వరికుంట ఎస్సీ కాలనీకి చెందిన మాడపూరు వెంకటరమణ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసుల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. మాడపూరు వెంకటరమణ ద్విచక్రవాహనంలో బద్వేలు నుంచి వరికుంటకు వెళుతుండగా అట్లూరు మండలం చౌటపల్లె గ్రామానికి చెందిన భాస్కర్‌ ఆచారి కారులో కడప నుంచి చౌటపల్లెకు వెళుతున్నాడు. ఈ క్రమంలో అయ్యప్పస్వామి స్వామి ఆలయం సమీపంలో కారు, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనం నుజ్జునుజ్జు అయింది. స్థానిక ఎస్‌ఐ నాగకీర్తన తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వెంకటరమణను 108లో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం వేలూరుకు తరలించనున్నట్లు బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ద్విచక్రవాహనం, కారును పోలీస్‌స్టేషన్‌కు తరతలించారు.

గాయపడిన వెంకటరమణ దెబ్బతిన్న ద్విచక్రవాహనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement