హుండీ ఆదాయం లెక్కింపు | - | Sakshi
Sakshi News home page

హుండీ ఆదాయం లెక్కింపు

Mar 5 2026 7:34 AM | Updated on Mar 5 2026 7:34 AM

హుండీ ఆదాయం లెక్కింపు

పెండ్లిమర్రి : పొలతల పుణ్యక్షేత్రంలో బుధవారం మహాశివరాత్రి అనంతరం శాశ్వత హుండీలను తెరిచి లెక్కించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌, కడప కార్యాలయం సూపరింటెండెంట్‌ రమణమ్మల పర్యవేక్షణలో ఆలయ కార్యనిర్వాహణాధికారి మూడే కృష్ణానాయక్‌, ఆలయ చైర్మన్‌ సిరిగిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో దేవస్థాన సిబ్బంది లెక్కింపులో పాల్గొన్నారు. శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం యొక్క శాశ్వతహుండీ ద్వారా రూ.7,54,932, శ్రీ అక్కదేవతల దేవస్థానం యొక్క శాశ్వత హుండీ ద్వారా రూ. 21,05, 683, శ్రీ బండెన్నస్వామి దేవస్థానం శాశ్వత హుండీ ద్వారా రూ.1,45,282, శ్రీ పుట్ట ఆంజనేయస్వామి దేవస్థానం శాశ్వత హుండీ ద్వారా రూ.1,40,723, అన్నదానం హుండీ ద్వారా రూ. 1020 కలిపి మొత్తం రూ.31,47,640 వచ్చింది. మికై ్సడ్‌ బంగారం సుమారుగా 0.21 గ్రాములు, మికై ్సడ్‌ సుమారుగా వెండి 2.599 గ్రాములు వచ్చిందని ఆలయ కార్యనిర్వణాధికారి మూడే కృష్ణనాయక్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement