విద్యుత్‌ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి

Mar 5 2026 7:34 AM | Updated on Mar 5 2026 7:34 AM

కడప కార్పొరేషన్‌: విద్యుత్‌ సమస్యలపై అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి పరిష్కరించాలని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ పర్యవేక్షక ఇంజినీరు ఎస్‌. రమణ అన్నారు. బుధవారం కడప విద్యుత్‌ భవన్‌ సమావేశ మందిరంలో వైయస్సార్‌ కడప జిల్లాలో విద్యుత్‌ సేవల పురోగతి, వేసవి కాలానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు, ప్రజలకు అందించే సేవల నాణ్యతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే వేసవి కాలంలో నిరంతర, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఫిర్యాదులను అధిక ప్రాధాన్యతతో పరిష్కరించాలని, ఫిర్యాదు పరిష్కార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించా రు. సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రసన్నాంజనేయు లు, జిల్లాలోని ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జి క్యూటివ్‌ ఇంజినీర్లు, అకౌంట్స్‌ విభాగానికి చెందిన అ కౌంట్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు, జూని యర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

ఏపీఎస్‌పీడీసీఎల్‌ పర్యవేక్షక ఇంజినీరు ఎస్‌. రమణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement