టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి | - | Sakshi
Sakshi News home page

టీటీడీ చైర్మన్‌ వెంటనే రాజీనామా చేయాలి

Mar 4 2026 7:39 AM | Updated on Mar 4 2026 7:39 AM

– మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి

ప్రొద్దుటూరు : ‘రంకునేర్చినమ్మ బొంకు నేర్చదా’అనే పాత సా మెతను టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు మళ్లీ గుర్తు చేశారని మాజీ ఎమ్మెల్యే,వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులో మంగళవారం తన క్యాంప్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎవరి జీవితం ఎలా ఉన్నా టీటీడీ చైర్మన్‌ అయ్యాక పూర్తి దైవభక్తితో మెలగాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే ప్రజలందరూ హర్షిస్తారన్నారు. టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అపచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. ప్రస్తుతం బీఆర్‌ నాయుడు రాసలీల వీడియోను ప్రపంచమంతా చూసిందని తెలిపారు. 30 ఏళ్లుగా ఉన్న ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో ఇలా ఎలా మెలుగుతారని ప్రశ్నించారు.పైగా చేసిన తప్పును గుర్తించకుండా తగ్గేదేలే అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీకి భజన చేసినందుకే బీఆర్‌ నాయుడుకు టీటీడీ చైర్మన్‌ పదవిని చంద్రబాబు కట్టబెట్టారన్నారు. బీఆర్‌ నాయుడు భగవద్గీతలో ఏముందని అనడం విచారకరమని తెలిపారు. శ్రీకృష్ణ పరమాత్ముడు బోధించిన భగవద్గీత మానవాళికి మార్గదర్శి అని అన్నారు. బీఆర్‌ గీతలో మాత్రం వాత్సాయన కామసూత్రాలు ఉంటాయన్నారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని విష ప్రచారం చేసిన వారి జీవితాలను ఆ వెంకటేశ్వరస్వామి చించేస్తున్నాడని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. హెరిటేజ్‌ కంపెనీ పాపర్‌ పట్టిందని, రఘురామరాజుకు కాలు విరిగిందని, బీఆర్‌ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఇంకా మున్ముందు ఏమి జరుగుతుందో చూడాల్సి ఉందన్నారు. ఇప్పటికై నా సీఎం చంద్రబాబు నాయుడు బీఆర్‌ నా యుడును టీటీడీ చైర్మన్‌గా తొలగించి మంచి వా రిని నియమిస్తే భక్తులంతా స్వాగతిస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement