జిల్లాలో మామిడి రైతులకు ఉద్యాన శాఖ సబ్సిడీ కవర్లను అందిస్తోంది. ఈ కవర్ల తొడగడం వల్ల నాణ్యమైన కాయలు వస్తాయి. ఈ కవర్ల ధర సాధారణంగా రూ. 2 అయితే 50 శాతం రాయితీతో ఒక కవర్ రూ.1తో అందిస్తోంది. ఒక హెక్టారు ( 2.5 ఎకరాలు) 15,000 కవర్లు చొప్పున ఒక రైతుకు 30 వేలు అవుతుంది. 50 శాతం సబ్సిడీతో రూ.15 వేల రుపాయలు రైతులకు రాయితీ ఇస్తుంది. ఇలా రెండు హెక్టార్లు (5 ఎకరాలు) వరకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న రైతులు ఉద్యాన అధికారులను సంప్రదించవచ్చు.
– జి.సతీష్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి


