ఎగువపల్లె కుంటకు కృష్ణా జలాలు | - | Sakshi
Sakshi News home page

ఎగువపల్లె కుంటకు కృష్ణా జలాలు

Mar 3 2026 8:10 AM | Updated on Mar 3 2026 8:10 AM

లింగాల : మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కృషి ఫలితంగా కొండ వారీ పల్లెల సాగు, తాగునీటి కష్టాలు తీరనున్నాయి. నాలుగు రోజుల క్రితం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పర్యటన సందర్బంగా గుట్టవారీ పల్లె గ్రామాలైన కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, లోపట్నూతల గ్రామాల రైతులు బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోవడంతో తమకు కృష్ణాజలాలు అందడంలేదని, భూగర్భజలాలు అడుగంటిపోయాయని, తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని జగన్‌ వద్ద మొరపెట్టుకున్నారు. దీంతో బియాండ్‌ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి ఏదో విధంగా ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ఆయన ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి సూచించారు. దీంతో ఎంపీ కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి సొంత నిధులతో భారీ ట్రాన్స్‌ఫార్మర్‌ను బియాండ్‌ ఎత్తిపోతల పథకం వద్దకు తరలించి ఆదివారం అమర్చారు. వెంటనే ట్రాన్స్‌పార్మర్‌కు విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేసి ఎత్తిపోతల పథకం మోటార్లను ఆన్‌చేసి కుంటలకు, చెరువులకు నీరు నింపాలని ఆదివారం ఆందోళన చేశారు. వెంటనే అధికారులు స్పందించి భారీ ట్రాన్స్‌పార్మర్‌కు విద్యుత్‌ ట్రాన్స్‌పార్మర్‌ ఏర్పాటు చేసి ఎత్తిపోతల పథక మోటార్లను సోమవారం సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఆన్‌ చేశారు. దీంతో కృష్ణా జలాలు ఎగువపల్లె కుంటకు పరుగులు తీస్తున్నాయి. వారం, 10రోజుల్లో కోమన్నూతల కుంట, అటు మురారిచింతల చెరువులకు నీరు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆయా గ్రామాల రైతులు, ప్రజలు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిలకు కృతజ్ఙతలు తెలిపారు.

ఫలించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌,

ఎంపీ వైఎస్‌ అవినాష్‌ల కృషి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement