రైతుల సమస్య తీర్చాలి
ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోయిందని 20 రోజుల నుంచి అధికారులకు ఫోన్లు చేస్తున్నాం. త్వరలో రెడీ చేస్తామన్నారు. వారు రాని పరిస్థితిలో మేం ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దగ్గరకి వెళ్లాం. ఆయన ట్రాన్స్‌ఫార్మర్ తెప్పించారు. మేం వచ్చి ట్రాన్స్‌ఫార్మర్‌ను దించుతుంటే ఎల్‌సీ కూడా ఇవ్వకుండా వాయిదా వేస్తున్నారు. మా వాళ్లు వచ్చి ట్రాన్స్‌ఫార్మర్ దించారు. వెంటనే అధికారులతో మాట్లాడితే ఎటువంటి స్పందన లేదు. ఇప్పటికై నా కనెక్షన్ ఇచ్చి రైతుల సమస్యలు తీర్చాలి. – వెంకటేశ్వరరెడ్డి,
రైతు, మురారిచింతల, లింగాల మండలం


