ముందస్తు జాతీయ లోక్ అదాలత్
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని సూచనల మేరకు నాలుగవ అదనపు జిల్లా జడ్జి దీన బాబు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ సీనియర్ సివిల్ జడ్జ్ బాబా ఫక్రుద్దీన్, ప్రిన్సిపల్ జూనియర్స్ విల్లేజ్ మార్చి 14న జరగబోయే జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా ముందస్తు లోక్ అదాలత్ సమావేశాన్ని కడపలోని నాలుగవ అదనపు జిల్లా జడ్జి కోర్టు హాల్‌లో శుక్రవారం నిర్వహించారు. కడప, అన్నమయ్య జిల్లాలలోని చిట్ ఫండ్ కంపెనీ వారు, ఫైనాన్స్ కంపెనీ వారి తరఫున న్యాయవాదులతో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కడప అన్నమయ్య జిల్లాలలోని చిట్ ఫండ్ కంపెనీ వారు, ఫైనాన్స్ కంపెనీ మేనేజర్లు, వారి తరఫున న్యాయవాదులు పాల్గొన్నారు.
– పాదముద్రలు గుర్తించిన ఫారెస్ట్ అధికారులు
సిద్దవటం: కడప ఫారెస్ట్ పరిధిలోని కనుమలోపల్లి అటవీ బీట్‌లో సి.రామచంద్రయ్య పంట పొలాల సమీపాన చిరుత పులి సంచారం చేస్తున్నట్లు పాదముద్రలు గుర్తించామని కడప ఫారెస్ట్ రేంజ్ అధికారి ప్రసాద్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలంలోని కనుమలోపల్లి అటవీ బీట్ సమీప ప్రాంతాలైన మూలపల్లి, కనుమలోపల్లి తదితర గ్రామాల్లో చిరుత సంచారం చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మూలపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ.. చిరుత పులిని గుర్తించేందుకు రెండు రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, గుర్తిస్తామన్నారు. చిరుత పులి రాత్రి వేళలో సంచారం చేస్తుందని మూలపల్లి గ్రామంలో బర్రెలు, మేకలపైన దాడి చేస్తుందని, రాత్రి వేళలో పొలాల్లోకి వెళ్లాలన్న రైతులు భయాందోళనకు గురవుతున్నామని, ఫారెస్టు అధికారులు తగు ఏర్పాట్లు చేసి, చిరుత పులిని బంధించాలని కోరారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
మదనపల్లెటౌన్ : మదనపల్లె మండలంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన కలకలం రేపుతోంది. వలసపల్లె పంచాయతీలో శుక్రవారం వెలుగు చూసిన ఘటనపై తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపిన వివరాలు.. అరవవాండ్లపల్లె సమీపంలోని హంద్రీ– నీవా కాలువ గట్టు వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి వీఆర్‌ఓ నాగేశ్వరావుకు ఫోన్ చేశారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెళ్లారు. మృతదేహం ఎవరిది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాన్నారు. అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
ముందస్తు జాతీయ లోక్ అదాలత్


