యువకుడి అదృశ్యం
మైదుకూరు: పట్టణంలోని శ్రీరామ్ నగర్‌కు చెందిన పాశం మహీధర్ అనే 18 ఏళ్ల యువకుడు కనిపించడం లేదని తండ్రి మారుతీకుమార్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమారుడు ఈ నెల 19న ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదని, అతని ఆచూకీ కనుగొనాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు అర్బన్ ఎస్‌ఐ చిరంజీవి తెలిపారు. యువకుడి ఆచూకీ తెలిసిన వారు మైదుకూరు అర్బన్ సీఐ నంబర్ 9121100618, అర్బన్ ఎస్‌ఐ నంబర్ 9121100619 లకు తెలియజేయాలని కోరారు.
ఐజాక్ మిషన్ తగిలి వ్యక్తికి తీవ్ర గాయాలు
వేంపల్లె : సిమెంటు రోడ్డుకు సిమెంట్, కంకర, ఇసుక కలుపుకొని వెళ్లే ఐజాక్ మిషన్ తగిలి వెంకట నారాయణ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం వేంపల్లెలోని నాలుగు రోడ్ల కూడలిలో ఐజాక్ మిషన్ కంకర్‌ను లోడింగ్ చేసే సమయంలో.. వెంకట నారాయణ కంకర కుప్పపై నుంచి వెళ్తుండగా ప్రమాదవశాత్తు కాలు జారి లోడింగ్ చేస్తున్న ఐజాక్ మిషన్ కింద పడ్డాడు. ఈ సంఘటనను గమనించిన ప్రజలు పెద్ద ఎత్తున కేకలు వేయడంతో ఐజాక్ మిషన్‌ను డ్రైవర్ నిలిపి వేయడంతో ప్రాణప్రాయం నుంచి బయటపడ్డాడు. ఐజాక్ కింద పడ్డ వెంకట నారాయణకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన గతంలో వేంపల్లెలోని వృషబాచలేశ్వరస్వామి దేవస్థానంలో ఔట్ సోర్సింగ్ పద్ధతి కింద పని చేసేవాడు. గాయపడిన వ్యక్తికి చెందిన బంధువులు శ్రీ సత్య సాయి జిల్లా తలుపులలో ఉన్నట్లు తెలిసింది.
యువకుడి అదృశ్యం


