ముళ్లపొదల్లోకి దూసుకెళ్లిన కారు
సిద్దవటం : కడప–చైన్నె జాతీయ రహదారి కనుములోపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం కారు అదుపు తప్పి ముళ్లపొదల్లోకి దూసుకెళ్లడంతో పెనుప్రమాదం తప్పింది. తెలంగాణ రాష్ట్రం కొత్తకోటకు చెందిన ఎన్.తనీష్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల దైవదర్శనానికి కారులో వెళ్తుండగా.. రోడ్డుకు అడ్డంగా బర్రె రావడంతో దాన్ని తప్పించబోయి కారు అదుపుతుప్పి హైవే రహదారికి ఆనుకుని ఉన్న ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. విషయాన్ని తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ ఏఎస్‌ఐ బాబయ్య, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేశారు.


