వేడుకగా నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట
వేంపల్లె : వేంపల్లె మండలం నందిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో శివలింగం విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గురువారం ఆలయంలో శివలింగం, విజయ గణపతి, సుబ్రమణ్యస్వామి, కాల భైరవ, నవ గ్రహ, ధ్వజ సహిత శ్రీపార్వతీ దేవి సమేత మహా నందీశ్వరస్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాల్లో కంచి కామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర సరస్వతి ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నందీశ్వర విగ్రహం, ధ్వజస్తంభం ప్రతిష్ట చేపట్టారు. అనంతరం ఆశ్వీరచన ప్రసంగం చేశారు. ఆలయం పరిసర ప్రాంతం హర హర మహా దేవ నామస్మరణతో మారుమోగింది. విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం మహిళలతో కోటి దీపోత్సవం నిర్వహించారు. అనంతరం గాయని మధుప్రియ బృందం పాటలతో అలరించారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్ రెడ్డి, నందిపల్లి సర్పంచ్ మారం సులోచనమ్మ పాల్గొన్నారు.
వేడుకగా నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ట


