మఠాధిపతిని సత్కరిస్తున్న మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి
మఠాధిపతి వెంకటాద్రిస్వామి
బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలోని శ్రీ మది్వరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని నూతన మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి తెలిపారు. మఠాధిపతి పట్టాభిõÙక మహోత్సవంలో భాగంగా గురువారం సాయంత్రం ప్రముఖులు, భక్తులతో ఆతీ్మయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటాద్రిస్వామి భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. తాను మఠాధిపతినైనా స్వామి వారి సేవకుడిగా, అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు. పట్టాభిõÙక మహోత్సవంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు.
అనంతరం మఠాధిపతికి కిరీట, ఛత్ర, చామర, ఆందోళిక అంగుళ్యాభరణ, మకరకుండల, శిఖా ముద్రిక, సింహతలాట, సింహాసనాది, పేనదండ, రుద్రాక్షమాల ధరింపజేశారు. పాదుకాపూజ, అధిష్టానమూర్తి దర్శనం, వేద స్వస్తి పండిత సత్కారం చేపట్టారు. వెంకటాద్రిస్వామిని స్థానిక మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి స్థానిక నాయకులతో కలిసి సత్కరించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో బ్రహ్మంగారిమఠం భక్తజన సంద్రంగా మారింది. వివిధ మఠాలకు చెందిన దాదాపు 20 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు విచ్చేశారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్వపు మఠాధిపతి కుమారులు వీరం»ొట్లయ్యస్వామి, దత్తాత్రేయస్వామి, మేనేజర్ ఈశ్వరయ్య, పీపీఎన్ ప్రసాద్ ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్‌పర్సన్ కమ్మర పార్వతమ్మ, మాజీ చైర్మన్ సింహాద్రి కనకాచారి, ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇన్‌చార్జి కర్రి వేణుమాధవ్, రాష్ట్ర కార్యదర్శి కాకమాను నరేంద్ర, వైఎస్‌ఆర్‌సీపీ మండల అధ్యక్షులు రత్నకుమార్ యాదవ్, టీడీపీ మండల అధ్యక్షులు సి.సుబ్బారెడ్డి, ప్రముఖ న్యాయవాది గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


