మత్తులో స్నేహితుడి హత్య | - | Sakshi
Sakshi News home page

మత్తులో స్నేహితుడి హత్య

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 11:59 AM

మద్యం షాపు వద్ద వాళ్లిద్దరూ స్నేహితులయ్యారు. చివరకు అదే మద్యం మత్తు ఒకరిని బలి తీసుకుంది. వైఎస్సార్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులోని నాగులకట్టవీధికి చెందిన వినయ్‌, రాయచోటిలోని ఎన్జీఓ కాలనీకి చెందిన గువ్వల సుబ్రమణ్యం స్నేహితులు. సుబ్రమణ్యం కొద్దిరోజులుగా పనులు చేసుకుంటూ ప్రొద్దుటూరులో ఉంటున్నాడు. వీళ్లిద్దరూ మద్యం తాగేందుకు తరచూ ఒక వైన్‌షాపు వద్దకు వెళ్తుండగా స్నేహితులయ్యారు. మద్యం తాగే సమయంలో ఇద్దరికీ గొడవ జరిగింది. 

ఈ క్రమంలోనే సుబ్రమణ్యం వినయ్‌ కుటుంబ సభ్యులను దూషించాడు. దీంతో ఎలాగైనా అతడిని హతమార్చాలని వినయ్‌ పథకం పన్నాడు. ఈ నెల 13న మద్యం తాగేందుకు సుబ్రమణ్యంను వినయ్‌ తన ఇంటికి పిలిచాడు. సుబ్రమణ్యం ఇంటికి రాగానే మద్యం మత్తులో ఉన్న వినయ్‌ కత్తితో పొడిచి చంపేశాడు. –ప్రొద్దుటూరు క్రైం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement