పై ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉదయగిరిరాజా. ఈయన సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ జీవిస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా రాజంపేటలోని మారుతీ ప్రసన్న లాడ్జి క్లాంపెక్స్‌లో ఉన్న కెనరా బ్యాంక్ ఏటీఎం వద్ద కాపలా కాస్తుంటారు. అనుమానాస్పద స్థితిలో బ్యాంకులోకి వెళుతున్న యువకులను ప్రశ్నించిన క్రమంలో మద్యం మత్తులో ఉన్న వారు ఆగ్రహంతో ఊగిపోయారు.
రాజాపై అక్కడే ఉన్న చైర్‌తో దాడిచేయడంతో తలకు గాయమైంది. రాజంపేట ప్రాంతీయవైద్యశాలలో చికిత్స పొందారు. యువకులపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అయితే సెక్యూరిటీ గార్డు పనిచేస్తున్న ప్రాంతంలో ఎదురుగా (మారుతీప్రసన్న లాడ్జీ) బ్రాందీషాపు ఉంది. సాయంత్రం నుంచే ఈ ప్రాంతంలో మద్యం ప్రియుల రగడ అంతాఇంతా కాదు. –రాజంపేట


