భారత నిర్మాణానికి సమగ్ర సమాచారం
కడప సెవెన్‌రోడ్స్ : కుటుంబ సరాసరి ఆదాయ వనరులను పెంచే ప్రణాళికలు రూపొందించటానికి జాతీయ గృహ ఆదాయ సర్వేలు ఎంతగానో ఉపయోగపడుతాయని, తద్వారా అత్యుత్తమ భారత సమాజ స్థాపన సాధ్యం అవుతుందని నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ పేర్కొన్నారు. బుధవారం కడపలోని ఆర్‌ఎస్‌ఆర్ స్క్వేర్ మాల్‌లో గణాంక సర్వే నిర్వహణపై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ) –ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ (ఎఫ్‌ఓడీ) కడప ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాంతీయ శిక్షణా శిబిరం (ఆర్‌టీసీ)కు జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2026 ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభం కానున్న జాతీయ గృహ ఆదాయ సర్వేలో భాగంగా, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే అధికారులకు, సిబ్బందికి సర్వేలోని ముసాయిదాలు, నిర్వచనాలు, సాంకేతిక అంశాలపై పూర్తి అవగాహన కల్పించడం కోసం రెండు రోజుల పాటు ప్రాంతీయ శిక్షణా శిబిరం (ఆర్‌టీసీ) నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (ఎన్‌ఎస్‌ఓ)– ఫీల్డ్ ఆపరేషన్ డివిజన్ (ఎఫ్‌ఓడీ) కడప ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించడం ఎంతో ఉపయోగకరం అన్నారు. మాస్టర్ ట్రైనర్, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస రావు, ఉమ్మడి జిల్లాల ఉప ప్రాంతీయ కార్యాలయాలైన కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించిన ఎస్‌ఎస్‌ఓ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
జాయింట్ డైరెక్టర్ నీతూ థామస్


