దళిత యువకులది పరువు హత్యే
బ్రహ్మంగారిమఠం: మండలంలో ఇద్దరు దళిత యువకులది పరువు హత్యేఅని, ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ డిమాండ్ చేసాడు. బుధవారం ఎమ్మార్‌పీఎస్, ఇతర దళిత సంఘాల నాయకులు, మహిళలు, యువకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం బి.మఠంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ మడలంలోని ముడుమాల, గుండాపురం ఎస్సీకాలనీలకు చెందిన ఓబులేసు, సతీష్‌లది పరువు హత్యే అని భావిస్తున్నామన్నారు. హత్యలు చేసిన వారు బయటకు రావాలంటే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలన్నారు. అంతవరుకు ఉద్యమం ఆగదన్నారు.కార్యక్రమంలో ఎమ్మార్‌పీఎస్ జాతీయ అధ్యక్షుడు నాగరాజు మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు సురేష్‌మాదిగ, ఎంఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌మాదిగ, నరేంద్రమాదిగ, ఈశ్వరయ్య, వెంకటేశ్‌మాదిగ, రాజు, జ్ఞానేశ్వర్ , నారాయణ , ఓబయ్య, తదితరులు పాల్గొన్నారు.


