అక్రిడిటేషన్ల జారీకి కమిటీ ఆమోదం | - | Sakshi
Sakshi News home page

అక్రిడిటేషన్ల జారీకి కమిటీ ఆమోదం

Jan 31 2026 6:43 AM | Updated on Jan 31 2026 6:43 AM

అక్రిడిటేషన్ల జారీకి కమిటీ ఆమోదం

అక్రిడిటేషన్ల జారీకి కమిటీ ఆమోదం

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలోని అర్హులైన 569 మంది జర్నలిస్టులకు తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తూ జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ ఆమోదం తెలిపిందని డీఎంఏసీ చైర్మన్‌, జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా కలెక్టర్‌ డీఎంఏసి చైర్మన్‌ శ్రీధర్‌ చెరుకూరి అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులందరికీ నిబంధనల ప్రకారం అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు,,మొదటి సమావేశంలో 569కి కమిటీ ఆమోదం తెలిపిందనన్నారు. ఇంకనూ అర్హత ఉన్న పాత్రికేయులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి తదుపరి సమావేశంలో అక్రిడిటేషన్లు మంజూరు చేయనున్నట్లు చప్పారు. సమావేశంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, డీఎంఏసీ కన్వీనర్‌ పద్మజ,డివిజనల్‌ పీఆర్వో సునీల్‌ సాగర్‌,ఆర్టీసీ ఆర్‌ఎం గోపాల్‌ రెడ్డి, డీఎంహెచ్‌ నాగరాజు, అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌ రంగ రాజు, పీడీ హౌసింగ్‌ రాజారత్నం, రైల్వే పీఆర్వో జనార్ధన్‌, వివిధ ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు పి.రామసుబ్బారెడ్డి, ఆంజనేయలు, నూర్‌ బాషా, జి.మురళి మోహన్‌ గౌడ్‌, వీయం.చంద్ర మోహన్‌ రాజు, మునోహర్‌, ఐసీ సుబ్బారెడ్డి, ఏ.సందీప్‌ కుమార్‌ రెడ్డి, కె.రమేష్‌, శ్రీకాంత్‌, కరస్పాండెంట్‌ ప్రసార్‌ భారతి బి.శ్రీనాథ్‌ రెడ్డి, ఫోటోగ్రాఫర్‌ టి.రత్నయ్య, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement