హ్యాకథాన్‌లో ఆర్కేవ్యాలీ విద్యార్థుల ప్రతిభ
వేంపల్లె : జాతీయ మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్‌లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా తెలిపారు. మంగళవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. విజయవాడలోని పీఎస్‌సీఎంఆర్ కళాశాలలో బ్రైనోవర్శన్ సొల్యూషనన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో జాతీయ స్థాయిలో మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్ జరిగిందన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ హ్యాకథాన్‌న్‌లో ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ విద్యార్థులు చురుకుగా పాల్గొని విశ్వవిద్యాలయం నవీనత, పరిశోధన, పరిశ్రమ– ఆధారిత విద్యపై పెట్టే ప్రత్యేక దృష్టికి నిదర్శనంగా కళాశాల ప్రతిష్టను జాతీయ స్థాయిల్లో మరింతగా పెంచారన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులైన అబ్దుల్ సమద్, సుఫ్ఫియన్, సుహైల్, పఠాన్ ముక్రం ఖాన్‌లను ట్రిపుల్ ఐటీ అధికారులు అభినందించారు.


