సహకార ఉద్యోగుల ధర్నా
కడప సెవెన్‌రోడ్స్ : తమ సమస్యలను పరిష్కరించాల ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ర త్నం మాట్లాడుతూ తమకు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం. 36ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు జీఓ లు జారీ చేసినప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 తర్వాత ఉద్యో గంలో చేరిన వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. సహకార ఉద్యోగులకు గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. 2019–24 వేతన సవరణ ఇవ్వాలన్నారు. కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు.
రాజుపాళెం : తనకు ఇష్టం లేని పెళ్లి వద్దని అటు తల్లిదండ్రులకు, ఇటు బంధువులకు, స్నేహితులకు చెప్పుకోలేక షేక్ పెద్ద మీరావలీ (24) అనే యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ పొలాల్లో జరిగింది. రాజుపాళెం ఎస్‌ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన షేక్ చిన్న మీరావలీ కుమారుడు పెద్ద మీరావలీకి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మంగళవారం ప్రొద్దుటూరులో బ్యాంకులో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెద్ద మీరావలీ వెల్లాల గ్రామ పొలాల్లో మామిడి జ్యూస్‌లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రాజుపాళెం ఎస్‌ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే పెద్ద మీరావలీ మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి చిన్న మీరావలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
చైల్డ్ కేర్ లీవ్‌పై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్‌కు గరిష్ట వయస్సు పరిమితిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హ ర్షణీయమని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్ర కటనలో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు గతంలో పిల్లల సంరక్షణ సెలవుల వినియోగానికి సంబంధించి పిల్లల గరిష్ట పరిమితి ఉండేదని, అయితే ప్రస్తుతం కూ టమి ప్రభుత్వం ఈ పరిమితిని తొలగించి ఉద్యోగులు తమ మొత్తం సేవా కాలంలో, రిటైర్మెంట్‌కు ముందు వరకు చైల్డ్ కేర్ లీవ్‌ను వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఉద్యోగులు ఈ సెలవులను పిల్లల సంరక్షణ, పరీక్షల సమయంలో, అనారోగ్య సందర్భాల్లో వినియోగించుకోవచ్చన్నారు.
సహకార ఉద్యోగుల ధర్నా


