ప్రత్యేక కృషి
పదో తరగతి పరీక్షలో ఉత్త మ ఫలితాల సాధనకు ప్ర త్యేక కృషి చేస్తున్నాం. విద్యార్థుల స్టడీ తరువాత నిర్వహించే పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉపాధ్యాయు లందరూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుంటున్నారు. మా పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– వెంకట సుబ్బారెడ్డి, జెడ్పీ హైస్కూల్, బద్వేల్
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేస్తున్నాం. తరచూ పాఠశాలలను సందర్శిస్తున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయులకు మేము తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. అందరి సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి
ప్రత్యేక కృషి


