రాబోయే రోజుల్లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభంజనం
పులివెందుల : రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలోని తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ గురువారం జరిగిన కడప మేయర్, ముద్దనూరు మండలం ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు గట్టిగా న్యాయం వైపు నిలబడడం జరిగిందన్నారు. వారు చేసిన మేలును గుర్తుపెట్టుకుని పార్టీ వారికి తగిన విధంగా అన్ని రకాలుగా మేలు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించడం జరిగిందన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరష్కారానికి చర్యలు తీసుకున్నారు.
యాత్రికుల మరణం బాధాకరం
అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాత్రికులు మరణించడం బాధాకరమని వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. యాత్రికుల మరణం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
జీతాలు ఇప్పించండి
పులివెందుల రాణి తోపులో పని చేస్తున్న కార్మికులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిశారు. తమకు కొద్ది నెలలుగా జీతాలు అందలేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని వారు ఎంపీతో వాపోయారు. దీనికి ఎంపీ వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ వారి జీతాలు సీడీఎంఏ ద్వారా మున్సిపాలిటీకి బదలాయించి పది రోజుల లోపు చెల్లిస్తామని ఎంపీకి వివరించారు.
ఎంపీకి సన్మానం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని ఇటీవల వైఎస్‌ఆర్‌సీపీ సోషల్ మీడియాలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న కొంగనపల్లి విజయ్, ఇతర నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని ఎంపీకి తెలిపారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


