మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు కోరారు. గంజాయి, మాదక దవ్య్రాలకు దూరంగా ఉండాలని ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను సోమవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ కార్యాలయంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ వినోద్ కుమార్ నాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పుడూ లేని విధంగా విశ్వవిద్యాలయాలు మొదలుకొని పాఠశాలల వరకు రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా గంజాయి దొరుకుతోందన్నారు. ఇటీవల నెల్లూరు నగరంలో పెంచలయ్య అనే యువకుడిని పట్టపగలే హత్య చేసిన ఘటన చూస్తే గంజాయి మాఫియా ఎంతకు బరితెగించిందో అర్థమవుతోందన్నారు. గంజాయి మాఫియాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టడి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ ఏఐవైఎఫ్ నాయకులు అరుణ్, అశోక్, అకిరానంద్, నాగేంద్ర నాయుడు తదితరులు పాల్గొన్నారు.


