అండర్–14 జోనల్ మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లు
4 వికెట్లు తీసిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ బౌలర్ జత్విక్
51 పరుగులు చేసిన సౌత్‌జోన్ విన్నర్స్ బ్యాట్స్‌మన్ రక్షణ్ సాయి
89 పరుగులు చేసిన సౌత్‌జోన్ విన్నర్స్ బ్యాట్స్‌మన్ ఎస్‌ఎండీ ఇజార్
137 పరుగులు చేసిన నార్త్‌జోన్ విన్నర్స్ బ్యాట్స్‌మన్ సీహెచ్ అక్షిత్‌రెడ్డి
4 వికెట్లు తీసిన సెంట్రల్ జోన్ విన్నర్స్ బౌలర్ రామ్ కిరణ్ విన్నీ
5 వికెట్లు తీసిన
రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ బౌలర్ దీక్షిత్
88 పరుగులు చేసిన రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ బ్యాట్స్‌మన్ సాయి కృష్ణచైతన్య
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 మూడవ విడత జోనల్ మ్యాచ్‌లు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్‌ఆర్‌ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్– సౌత్‌జోన్ విన్నర్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్ విన్నర్స్ జట్టు 72 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహ్మద్ ఇజార్ 89 పరుగులు, రక్షణ్ సాయి 51 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టులోని యూనైస్ 3 వికెట్లు, నాగ వెంకట జత్విక్ 4 వికెట్లు తీశారు. దీంతో సక్రమంగా వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ ఆపి వేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
అదేలాగే కేఎస్‌ఆర్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌జోన్ విన్నర్స్–సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నార్త్‌జోన్ విన్నర్స్ జట్టు 90 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆ జట్టులోని యాసిల్ విఘ్నేష్ 49 పరుగులు, పిహెచ్ అక్షిత్ రెడ్డి చక్కటి లైనప్‌తో బ్యాటింగ్ చేసి 237 బంతుల్లో 18 ఫోర్లతో 137 పరుగులు చేశాడు. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని రామ్ కిరణ్ విన్నీ 4 వికెట్లు, యాసిన్ సిద్దిఖ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో..
కేఓఆర్‌ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్– రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్‌జోన్ జట్టు 69.5 ఓవర్లకు 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయికృష్ణ చైతన్య 88 పరుగులు, తాహీర్ 44 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్‌జోన్ జట్టులోని నందన్ కృష్ణ సాయి 2 వికెట్లు, దీక్షిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, యోజిల్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 21 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రజ్ఞాన్ పండిత్ 36 పరుగులు చేశారు. వెలుతురు లేకపోవడంతో మ్యాచ్‌ను నిలిపి వేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.
అండర్–14 జోనల్ మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లు
అండర్–14 జోనల్ మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లు
అండర్–14 జోనల్ మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లు
అండర్–14 జోనల్ మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లు
అండర్–14 జోనల్ మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లు
అండర్–14 జోనల్ మ్యాచ్‌లో సత్తా చాటిన బౌలర్లు


