డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు | - | Sakshi
Sakshi News home page

డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

Nov 27 2025 6:15 AM | Updated on Nov 27 2025 6:15 AM

డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు

కడప వైఎస్‌ఆర్‌ సర్కిల్‌ : ఏసీఏ అండర్‌–14 జోనల్‌ మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. రెండవ రోజు కేఓఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌–సెంట్రల్‌జోన్‌ విన్నర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 96 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన సెంట్రల్‌జోన్‌ జట్టు 51.5 ఓవర్లకు 147 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని కె. తమ్మన్‌ సాయి 52 పరుగులు, ప్రదీప్‌ 23 పరుగులు చేశారు. రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్టులోని ముని 3 వికెట్లు, హేమంత్‌ 2 వికెట్లు, రోహిత్‌ 2 వికెట్లు, యశ్వంత్‌ పూర్యతేజ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్టు 62 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. ఆ జట్టులోని కిన్ను కిషల్‌ 77 పరుగులు, సాయి కృష్ణ చైతన్య 53 పరుగులు చేశారు. సెంట్రల్‌ జోన్‌ జట్టులోని యాసిన్‌ సిద్దిఖీ అద్భుతంగా బౌలింగ్‌ చేసి 5 వికెట్లు తీశాడు. రామ్‌ కిరణ్‌ విన్నీ 3 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ సౌత్‌జోన్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో ..

వైఎస్‌ఆర్‌ఆర్‌ ఏసీఏ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌ విన్నర్స్‌– సౌత్‌జోన్‌ విన్నర్స్‌ జట్లు జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. రెండవ రోజు తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సౌత్‌జోన్‌ విన్నర్స్‌ 78.4 ఓవర్లకు 211 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఆ జట్టులోని మహ్మద్‌ ఇజార్‌ 50 పరుగులు, రక్షన్‌ సాయి 50 పరుగులు చేశారు. నార్త్‌జోన్‌ విన్నర్స్‌ జట్టులోని షణ్మఖ గణేష్‌ 3 వికెట్లు, లోహిత్‌ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన నార్త్‌ జోన్‌ విన్నర్స్‌ జట్టు 9 ఓవర్లకు 29 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో నార్త్‌ జోన్‌ విన్నర్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో..

కేఎస్‌ఆర్‌ఎం క్రికెట్‌ మైదానంలో రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌జోన్‌–రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 66 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో మ్యాచ్‌ను ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ జట్టు 90 ఓవర్లకు 337 పరుగులకు డిక్లేర్డ్‌ చేసింది, ఆ జట్టులోని పీవీఎస్‌ఆర్‌ వర్మ అద్భుతంగా చక్కటి లైనప్‌తో బ్యాటింగ్‌ చేసి 160 బంతులకు 110 పరుగులు చేశాడు. మక్కే లిఖిత్‌ 71 పరుగులు చేశాడు. రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టులోని నంద కృష్ణ సాయి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన రెస్ట్‌ ఆఫ్‌ నార్త్‌ జోన్‌ జట్టు 18 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధన్విన్‌ 67 పరుగులు చేశాడు. రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జట్టులోని ధోని 2 వికెట్లు, లోకేష్‌ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెస్ట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యత సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement