రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ విజేతలు అనంతపురం, కృష్ణా
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి అండర్ 14 బాల,బాలికల బాస్కెట్ బాల్ పోటీల్లో బాలుర విభాగంలో అ నంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. బాలికల జట్టులో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించింది. మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన 69వ ఎస్‌జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలు బుధవా రం ముగిశాయి. బాలుర విభాగంలో ఫైనల్స్‌లో అనంతపురం, తూర్పు గోదావరి జట్లు పోటీపడగా అనంతపురం జిల్లా జట్టు విజయం సాధించింది. చిత్తూరు జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్‌లో పోటీపడగా కృష్ణా జట్టు 29–15 పాయింట్లతో మొద టి స్థానం దక్కించుకుంది. తృతీయ స్థానంలో చిత్తూ రు జట్టు నిలిచింది. విజయం సాధించిన జట్లకు ఉమ్మ డి చిత్తూరు జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు, జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి నాగరాజు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్‌బాబు, పీడీలు రమేష్, మొయినుద్దీన్, ఆసిఫ్, రియాజ్, రాజేశ్వరి, లత, భారతి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర స్థాయి అండర్ –14 బాలుర జట్టు:
యోగేశ్వర్, నిఖిల్, సత్య( అనంతపురం), జశ్వంత్‌కుమార్, చరణ్(తూర్పు గోదావరి), దీపేష్, పుష్కర్( చిత్తూరు), డేనియల్ నాష్, రోహిత్(కృష్ణా) వేదాంతరెడ్డి(పశ్చిమ గోదావరి), నీల్‌జుబేను( (వైజాగ్), ధర్మేందర్(నెల్లూరు), మోక్షిత్( కర్నూలు), స్టాండ్‌బైలుగా పావన వెంకటదుర్గేష్( పశ్చిమ గోదావరి),షణ్ముఖ,(అనంతపురం), సింహాద్రి( తూర్పు గోదావరి), షణ్మఖ( గుంటూరు), మున్నా (కృష్ణా), భరత్ (చిత్తూరు) ఎంపికయ్యారు.
అండర్–14 రాష్ట్ర స్థాయి బాలికల జట్టు:
కావ్య,జెస్సీ(కృష్ణా), లాస్య, దివ్యశ్రీ (తూర్పు గోదావరి), నీలిషా, హరిత (చిత్తూరు), సాత్విక, సంజన (పశ్చిమ గోదావరి), కావ్య (గుంటూరు), హర్షిత( (కర్నూలు), నవ్య (వైజాగ్), లిఖిత( నెల్లూరు), స్టాండ్‌బైలుగా సిద్ర(అనంతపురం), రత్నదీపిక( తూర్పుగోదావరి),నీలిమ (కృష్ణా), కీర్తన శ్రీ (కర్నూలు), అక్షయ (గుంటూరు), లోహిత (వైజాగ్) ఎంపికయ్యారు.


