రైల్వేలైన్‌కు రక్షణ! | - | Sakshi
Sakshi News home page

రైల్వేలైన్‌కు రక్షణ!

Nov 22 2025 7:00 AM | Updated on Nov 22 2025 7:32 AM

రైల్వేలైన్‌కు రక్షణ! ● పట్టాల వద్ద కాపలా..

పట్టాల వెంబడి ప్రహారీగోడలు

రైలు ట్రాక్‌, పొలాలకు మధ్య నిర్మాణాలు

ప్రమాదాల నివారణకు చర్యలు

రాజంపేట: ముంబై –చైన్నె కారిడార్‌ రైలుమార్గంలోని రైలు పట్టాల వెంబడి అనేక పల్లెలు, అటవీ ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో పల్లె ప్రాంతాల్లో పశువులు, అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణులు పట్టాలపైకి వచ్చేస్తున్నాయి. వేగంగా వచ్చే రైలింజన్‌ కింద పడటంతో ముందుకు వెళ్లడానికి వీల్లేకుండా పోతోంది. దీంతో రైల్వేలైన్‌ రక్షణ చర్యల్లో భాగంగా ప్రహారీగోడలను నిర్మిస్తున్నారు. ఉభయ వైఎస్సార్‌జిల్లాలో పరిధిలోని రైల్వేట్రాక్‌కు ఇరువైపులా గోడల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అవుట్‌ ఆఫ్‌ స్టేషన్‌ స్టీల్‌ పెన్సింగ్‌ నిర్మించనున్నారు. జిల్లాలో రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రం నుంచి చెయ్యేరులోకి వెళ్లే గొల్లపల్లె రహదారిలో రూ.8కోట్లతో ప్రహారీ గోడ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇదే తరహాలో ఎక్కడైతే అధికంగా పశువులు రైలుపట్టాలపైకి వస్తున్నాయో గుర్తించి అక్కడ ప్రహారీగోడలను నిర్మితం చేస్తున్నారు. అయితే ఈ రహదారి చెయ్యేరులో శ్మశానానికి దారి కావడంతో ప్రహరీ గోడ అడ్డుగా నిలుస్తోంది. శ్మశానంలో వెళ్లేందుకు వీలులేని పరిస్థితులున్నాయి. నాగిరెడ్డిపల్లె, అరవపల్లె వాసులు ఆందోళన చెందుతున్నారు. చెయ్యేరులోకి ప్రవేశానికి గేటు పెట్టాలనే ఉద్దేశంతో రైల్వేశాఖ ఉన్నట్లు తెలుస్తోంది.

కాటిల్‌రన్‌వర్‌తో...రైల్వేకు ఇబ్బందులు...

కాటిల్‌ రన్‌వర్‌తో రైళ్ల రాకపోలకు తీవ్రఅంతరాయం కలుగుతోంది. ఫలితంగా రైళ్లు ఆలస్యంగా నడవాల్సిన పరిస్థితి. ఇటీవల నందలూరు–మంటంపంపల్లె వద్ద ఆల్విన్‌ సమీపంలో ముంబయి–చైన్నె మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్‌ రైలు కింద పశువులు పడటంతో ముందుకు కదలలేకపోయింది. స్టేషన్‌ బయట కూడా రూ.50కోట్ల

స్టీల్‌ పెన్సింగ్‌ కూడా నిర్మించనున్నారు.

పశువులు ట్రాక్‌పైకి రాకుండా ఒకరిని కాపాలగా ఏర్పాటుచేశారు. కడప, నందలూరు సెక్షన్లలో పల్లె సమీపంలో పశువులు పట్టాలెక్కి మృత్యువాతకు గురవుతున్నాయి. ఫలితంగా రైలు జర్నీకి బ్రేక్‌పడుతోంది. ఒకవేళ పశువు కొమ్ము లోకో వీల్‌ కింద పడితే పట్టాలు తప్పడం కూడా జరుగుతుందని రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి.

రైల్వేలైన్‌కు రక్షణ! 1
1/3

రైల్వేలైన్‌కు రక్షణ!

రైల్వేలైన్‌కు రక్షణ! 2
2/3

రైల్వేలైన్‌కు రక్షణ!

రైల్వేలైన్‌కు రక్షణ! 3
3/3

రైల్వేలైన్‌కు రక్షణ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement