ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడిగా బాలరాజు
రాజంపేట: ఇండియన మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షునిగా నందలూరు మండలం టంగుటూరు పంచాయతీ వి.రాచపల్లెకు చెందిన డాక్టర సంగరాజు బాలరాజు ఎన్నికయ్యారు. ఈనెల 22, 23వ తేదీల్లో రాజంపేట–రాయచోటి రహదారిలోని తిరుమల కన్వెన్సన్ సెంటర్‌లో జరిగే వైద్యవిజ్ఞాన సదస్సులో బాలరాజు ప్రమాణస్వీకారం జరగనుంది. ఈ సదస్సుకు రాష్ట్రంలోని నలమూలల నుంచి 600 మందికి వైద్యనిపుణులు, వైద్యులు తరలివస్తున్నారు. రాజంపేటలో నేటి నుంచి రెండురోజుల పాటు వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించేందుకు ఐఎంఏ వర్గాలు సర్వం సిద్ధం చేశాయి. జయరామరాజు, జానకమ్మ దంపతులకు 1970లో బాలరాజు జన్మించారు.ఎంబీబీఎస్ కర్నూలు మెడికల్ కాలేజీలో పూర్తి చేశారు. చెస్ట్ స్పెషలిస్టుగా రాజంపేటలో పేరు గడించారు. 2004 లో రాజంపేట ఐఎంఏ బ్రాంచి సెక్రటరీగా పనిచేశారు.


