రేపు జాబ్‌మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, ఉపాధి కల్పనా వ్యవస్థాపక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో డిప్లొమా, బీటెక్, డిగ్రీ, ఎంబీఏ పూర్తి చేసి సోలార్‌లో అనుభవంగల యువతకు జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. కడపలోని ఇంజనీర్స్ భవన్‌లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 63027 02399, 70323 25252 నెంబరులో సంప్రదించాలని సూచించారు.


