జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వర్షం
కడప అగ్రికల్చర్: ఉపరితల ఆవర్తనంతో జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలోని ఎనిమిది మండలా ల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా గోవపరం మండలంలో 7.6 మి.మీ, కమలాపురం మండలంలో 6.2, అట్లూరు మండలంలో 4, బి.మఠంలో 3.2, బద్వేల్ 2.8, పోరుమామిళ్లలో 2, కాశినాయన, వల్లూరు మండలాల్లో 1.8 మి.మీ వర్షం కురిసింది.
కడప రూరల్: జిల్లాలో అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సివిల్స్ (ప్రిలిమినరీ, మెయిన్స్) పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఏపీ బీసీ స్టడీ సర్కిల్ సంచాలకులు ఎం.అంజల తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు విజయవాడలో ఉచిత శిక్షణ ఉంటుందని పేర్కొ న్నారు. అభ్యర్థులు ఈనెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను బీసీ స్టడీ సర్కిల్, బీసీ భవన్, కడప అనే చిరునామాలో సమర్పించాలని తెలిపారు. వివరాలకు సెల్ నంబరు 97031 85382 ను సంప్రదించాలని సూచించారు.
కడప కార్పొరేషన్: ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్నికలకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన ఫార్మా ప్లస్ ప్రొప్రైటర్, ఫార్మసీ సంక్షేమ సంఘం స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ కోటపాటి రాధాక్రిష్ణ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో కడప జిల్లా నుంచి తాను పోటీ చేస్తున్నానని తెలిపారు. ఫార్మస్టిస్టులకు సబ్సిడీతో కూడిన రుణాలివ్వాలని, ఫార్మసీ యాక్టు 1948ని అమలు చేయాలని, కాంట్రాక్టు ఫార్మసీ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో ఫార్మసిస్టు ఉద్యోగాలు కల్పించాలనే డిమాండ్లతో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని తెలిపారు. ఫార్మసిస్టులు తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శుక్రవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఆలయానికి రూ. 25,73,262 లు ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ఇందులో ఆలయంలో ఉన్న ఏడు శాశ్వత హుండీల ద్వారా రూ.25,07,015లు అన్నదాన హుండీ ద్వారా రూ.66,247లు వచ్చిందని చెప్పారు. అలాగే మిక్స్‌డు బంగారు వస్తువులు ,మిక్స్‌డు వెండి వస్తువులు వచ్చినట్లు ఆయన తెలిపారు. కడప దేవదాయశాఖ కార్యాలయ అధికారి రమణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్కే వ్యాలీ ఏఎస్సైలు నాగరాజు, చంద్ర శేఖరరెడ్డి పోలీసులు, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు.
కడప ఎడ్యుకేషన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నోలో నవంబర్ 23 నుంచి 29 వరకు జరుగుతున్న 19వ నేషనల్ జంబోరికి పెడ్లిమర్రి మండల కేజీబీవీ విద్యార్థులు ఎంపికయ్యారని గర్ల్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్(జీసీడీఓ) దార్ల రూత్ ఆరోగ్య మేరి తెలిపారు. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాల నుంచి స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో విద్యార్థులు, స్కౌట్స్ మాస్టర్స్, గైడ్స్ కెప్టెన్‌లు వేల సంఖ్యలో పాల్గొంటారని తెలిపారు. మన జిల్లా నుంచి సుమారు 70 మంది హాజరు కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రాధాన్యత, ఆవశ్యకత గురించి ప్రసంగిస్తారని తెలిపారు. నేషనల్ జంబోరి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు ఎంపిక కావడం తమకు గర్వకారణంగా ఉందని జీసీడీఓ మేరీ, మండల ఎంఈఓలు సుజాత, గంగాధర్ నాయక్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ సరస్వతి, పీడీ సంతోషకుమారి పాల్గొన్నారు.
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వర్షం
జిల్లాలోని ఎనిమిది మండలాల్లో వర్షం


