విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

Nov 17 2025 8:22 AM | Updated on Nov 17 2025 8:22 AM

విద్యార్థి అదృశ్యం..  కేసు నమోదు

విద్యార్థి అదృశ్యం.. కేసు నమోదు

కడప అర్బన్‌ : కడప నగర శివార్లలోని రిమ్స్‌ పీఎస్‌ పరిధిలో బహుజననగర్‌లో నివాసం వుంటున్న అల్లెం నందకుమార్‌(14) అనే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నాడు. అతని తండ్రి కృష్ణ అక్టోబర్‌ 23వ తేదీన ఉదయం 7:30 గంటల సమయంలో స్కూలుకు వెళ్లేందుకు తమ కుమారుడు నందకుమార్‌ను కడప సెంట్రల్‌ జైలు సమీపంలో బస్కు ఎక్కించాడు. స్కూలుకు వెళ్లలేదని, తిరిగి ఇంటికి రాలేదని తండ్రి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఆచూకీ కోసం ఇప్పటి వరకు విచారణ చేపట్టామని, ఎక్కడా ఆచూకీ తెలియనందున ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప రిమ్స్‌ పీఎస్‌ సీఐ రామకృష్ణారెడ్డి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement